రావెల కిషోర్‌బాబు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రావెల కిశోర్ బాబు
జననం (1959-03-11) 1959 మార్చి 11 (వయసు 65)
రావెల, తాడికొండ మండలం, గుంటూరు జిల్లా
విద్యఎం. ఎ, ఎం. ఫిల్
వృత్తిఅధ్యాపకుడు, ప్రభుత్వ అధికారి, రాజకీయ నాయకుడు

రావెల కిశోర్ బాబు ఒక రాజకీయ నాయకుడు, మాజీ ప్రభుత్వ అధికారి, మజీ అధ్యక్షుడు.

జీవిత విశేషాలు

[మార్చు]

తాడికొండ మండలం రావెలలో 1959 మార్చి 11న జన్మించిన కిషోర్‌బాబు 1973లో అమరావతి ఎస్‌ఆర్‌కె ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తిచేసారు. గుంటూరు ఏసి కళాశాలలో ఇంటర్, అమరావతి ఆర్‌వివిఎస్ కళాశాలలో డిగ్రీ, ఆంధ్రా యూనివర్సిటీలో ఎంఎ, నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ చేశారు. తొలుత ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎబిఎం డిగ్రీ కళాశాలలో ఆర్థికశాఖ అధ్యాపకుడిగా చేరిన ఆయన అనంతరం ఎస్‌బిఐలో ప్రొబెషనరీ అధికారిగా గుజరాత్‌లో పనిచేసారు. 1987లో సివిల్స్ రాసి ఐఆర్‌టిఎస్‌కు ఎంపికయ్యారు. 1989లో దక్షిణ మధ్య రైల్వేలో ఉన్నతోద్యోగం పొంది వివిధ శాఖల్లో సీనియర్ లెవెల్ అధికారిగా విధులు నిర్వహించారు. 2000-2002 మధ్య ఢిల్లీలో దివంగత లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి.బాలయోగి వద్ద ఆంతరంగిక కార్యదర్శిగా పనిచేసారు. తర్వాత 2004 వరకు బి. ఆర్ అంబేద్కర్ ఫౌండేషన్ జాతీయ డైరెక్టర్‌గా, తరువాత దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డెప్యూటీ కమర్షియల్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2009 నుంచి 2012 వరకు కులీకుతుబ్‌షా అర్బన్ డెవలప్‌మెంట్ అధారిటీ సికింద్రాబాద్‌లో అడ్మినిస్ట్రేటర్‌గా పనిచేసారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారిగా బాధ్యతలు నిర్వహించిన కిషోర్‌బాబు 2014 ఏప్రిల్ 15న తన ఉద్యోగానికి రాజీనామా చేసి సార్వత్రిక ఎన్నికల్లో ప్రత్తిపాడు నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా వైసిపి అభ్యర్థిని మేకతోటి సుచరితపై విజయం సాధించారు.[1][2] కొన్నాళ్ళు చంద్రబాబు నాయుడి నాయకత్వంలో మంత్రిగా కూడా పనిచేశాడు. తర్వాత 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడంతో వైఎస్సార్సీపీలో చేరాడు. 2024 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఓడిపోవడంతో ఆ పార్టీకి రాజీనామా చేశాడు.[3][4]

వనరులు

[మార్చు]
  1. Sakshi (22 March 2019). "తాడికొండలో పుట్టి.. ప్రత్తిపాడులో పోటీ". Sakshi. Archived from the original on 11 జూలై 2021. Retrieved 11 July 2021.
  2. http://www.andhrabhoomi.net/node/149250
  3. "Ravela Kishore Babu: వైకాపాకు మాజీ మంత్రి రావెల కిశోర్‌బాబు రాజీనామా". EENADU. Retrieved 2024-06-07.
  4. ABN (2024-06-07). "YCP: ఫస్ట్ వికెట్ ఔట్.. వైసీపీకి రావెల రాజీనామా". Andhrajyothy Telugu News. Retrieved 2024-06-07.